Book Exchange Club

గ‌త ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా తెలుగు ఇబుక్స్ (ఎల‌క్ట్రానిక్ పుస్త‌కాలు లేదా డిజిట‌ల్ పుస్త‌కాలు)ను ఉచితంగా పాఠ‌కుల‌కు అందిస్తున్న‌ వికాస ధాత్రి ఉచిత పుస్త‌కాల మార్పిడి ప‌థ‌కానికి శ్రీ‌కారం చుడుతోంది.
పాఠ‌కులుగా మ‌నం ఎన్నో పుస్త‌కాల‌ను కొనుగోలు చేస్తూ వుంటాం. వాటిని చ‌దివిన త‌ర్వాత‌, అవి అర‌ల‌లో వుండ‌ట‌మే త‌ప్ప‌, వాటిని మ‌ళ్ళీ మ‌ళ్లీ మ‌నం చ‌ద‌వ‌టం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. వాటిని కొంత‌కాలం త‌ర్వాత చిత్తు పుస్త‌కాలుగా అమ్మేయ‌ట‌మూ జ‌రుగుతుంది. ఇలా కాక ఆ పాత పుస్త‌కాల‌ను ఎవ‌రికైనా ఇచ్చి, మ‌న‌కు న‌చ్చే మ‌రికొన్ని పుస్త‌కాల‌ను పొందితే ఎంత బాగుంటుంది? ఇలా పుస్త‌కాల‌ను మార్చుకొని చ‌ద‌వ‌టం వ‌ల‌న, కాగితం త‌యారీ కోసం వాడే చెట్ల‌ను కూడ మ‌నం కాపాడిన వాళ్ళ‌మ‌వుతాం. మ‌న ప‌ర్యావ‌ర‌ణాన్ని సంర‌క్షించిన‌ట్ల‌వుతుంది కూడా.

నియ‌మ నిబంధ‌న‌లు:
త‌మ వ‌ద్ద నున్న పాత‌, కొత్త పుస్త‌కాల‌ను పాఠకులు ఈ ప‌థ‌కం ద్వారా మార్చుకోవ‌చ్చు. క‌నీసం అయిదు పుస్త‌కాల‌ను ఇచ్చి, త‌మ‌కు న‌చ్చిన అయిదు పుస్త‌కాల‌ను తీసుకోవ‌చ్చు.
పుస్త‌కం ధ‌ర‌తో సంబంధం లేదు. కేవ‌లం పుస్త‌కాల సంఖ్య‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొంటాం.
పుస్త‌కం వెల ప్ర‌క‌టించ‌ని పుస్త‌కాల‌ను కూడ మార్చుకోవ‌చ్చు.
పాల్గొనాల‌నుకొనే పాఠ‌కులు త‌మ వ‌ద్ద వున్న పుస్త‌కాల వివ‌రాల‌ను వికాస‌ధాత్రి www.vikasadhatri.org, స్కూల్ రేడియో www.schoolradio.in వెబ్‌సైట్‌ల‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఫారాన్ని నింపాలి.
ఫారం ద్వారా తెలియ‌జేసిన పుస్త‌కాల వివ‌రాల‌న్నిటినీ, వికాస ధాత్రి వెబ్‌సైట్‌లో వుంచుతాం.
ఫారంలో ఇచ్చిన ఇమెయిల్ ఐడి కి స‌మ‌యం, వేదిక వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఆహ్వానం పంపుతాం. వ‌చ్చేట‌పుడు తాము ఫారంలో తెలియ‌జేసిన అయిదు పుస్త‌కాల‌ను తీసుకురావాలి. వేదిక వ‌ద్ద ఆ పుస్త‌కాల‌ను ముందుగా ఇవ్వాలి. ఆ త‌ర్వాత అక్క‌డ వున్న పుస్త‌కాల నుంచి త‌మ‌కు న‌చ్చిన పుస్త‌కాల‌ను ఎంచుకొని తీసుకోవాలి.
ఈ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నం వాసుల‌కు మాత్ర‌మే ప‌రిమితం. మున్ముందు ఇత‌ర న‌గ‌రాల‌లో కూడ నిర్వ‌హించ‌టం జ‌రుగుతుంది.

రిజిస్ట్రేష‌న్ ఫారం